తాజా వార్తలు

ప్రమాదానికి గురైన ఏకైక అణు జలాంతర్గామి!

భారత్‌కు చెందిన ఏకైక అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్ర ప్రమాదానికి గురైంది. సముద్రంలో ఏదైనా నౌకను ఢీకోట్టడం వల్ల, విశాఖ షిప్‌యార్డ్‌లోకి ప్రవేశించే సమయంలో తుక్కును ఢీకొనడం వల్లగానీ ఈ ప్రమాదం జరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను వివరించడానికి నావికాదళ అధికారులు నిరాకరించారు. ఈ జలాంతర్గామిని రష్యా నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో జలాంతర్గామి ముందు భాగంలోని టార్పెడో ట్యూబ్‌ కింద ఉండే కఠినమైన లోహం టైటానియంతో తయారుచేసిన సోనార్‌ డోమ్‌ దెబ్బతింది.

ఈ భాగాన్ని మరమ్మత్తు చేయడానికి ప్రత్యేకమైన నిపుణులు అవసరం తప్పనిసరి. దీనికి విశాఖ తీరంలోనే మరమ్మతులు చేయనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ జలాంతర్గామిని కూడా విశాఖలోనే తయారు చేశారు. 2012లో భారత నౌకాదళంలోకి ప్రవేశించిన ఐఎన్‌ఎస్‌ చక్ర ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలంతార్గముల్లో ఒకటి. రష్యాకు చెందిన అకులా-2 శ్రేణి సబ్‌మెరైన్ల అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను భారత్‌ లీజుకు తీసుకుంది. ఇది కేవలం అణుశక్తితో పనిచేస్తుంది. దీనిలో అణ్వస్త్రాలు ఉండవు. కానీ అత్యంత రహస్యంగా ప్రయాణించి శత్రునౌకలను కూల్చడంతోపాటు భూమిపై లక్ష్యాలను ఛేదిస్తుంది.Latest News