తాజా వార్తలు

‘జయజానకి నాయక’ రిలీజ్ డేట్ ఛేంజ్!

బోయపాటి శ్రీను ‘జయజానకి నాయక’ మూవీ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కుతగ్గాడా అంటే లేదు మిగతా సినిమాల కంటే ఒక అడుగు ముందే ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘జయజానకి నాయక’ మూవీ ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పటికీ అదే రోజున బాక్సాఫీస్ బరిలో మరో రెండు పెద్ద సినిమాలు ఉండటంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగష్టు10న ‘జయజానకి నాయక’ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఆగస్ట్ 11న మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. రానా 'నేనే రాజు నేనే మంత్రి', బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకి నాయక', నితిన్ 'లై' సినిమాలు అదే రోజున బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో ఇప్పుడు ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూడు సినిమాల్లో ఏది లాభ పడుతుంది, దీనికి లాస్ వస్తుందనే విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.Latest News