తాజా వార్తలు

చంద్రబాబుని కలిసిన పి.వి.సింధు..!

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పి.వి.సింధు గ్రూప్‌-1 ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని గురువారం పి.వి.సింధుకి అందజేశారు. దేశం గర్వించేలా మరిన్ని పతకాలు సింధు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

గత ఏడాది ముగిసిన రియో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సింధు ఫైనల్‌కి చేరింది. అక్కడ కరోలినా మారిన్ చేతిలో ఓడినా.. బ్యాడ్మింటన్‌లో రజతం గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్‌లో సింధు పోరాట పటిమకి మెచ్చిన చంద్రబాబు నాయుడు అప్పట్లో సింధుకి గ్రూప్-1 ఆఫీసర్‌ ఉద్యోగాన్ని ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించిన నియామక పత్రాన్ని ఆమెకి స్వయంగా అందజేశారు.Latest News