తాజా వార్తలు

'రంగస్థలం' టైటిల్‌కి అర్థం చెప్పిన సుకుమార్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమా షూట్‌తో బిజీగా వున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి 'ఈ సినిమాకు రంగస్థలం అనే టైటిల్‌నే ఎందుకు పెట్టారబ్బా?' అనే ప్రశ్న చాలామంది అభిమానులని వేధిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ది ఓ విలేజ్ డ్రామా ఆర్టిస్ట్ పాత్ర కాబట్టి సుకుమార్ ఆ టైటిల్ ఎంచుకుని వుండవచ్చేమో అని కొంతమంది సరిపెట్టుకున్నప్పటికీ... దాని వెనుకున్న అసలు కారణం మాత్రం వేరే వుందని తాజాగా సుకుమార్ స్వయంగా వెల్లడించాడు.

'' సాధారణంగా ఏ ఊరిలోనైనా మనుషుల మధ్యే రకరకాల పాత్రలు కనిపిస్తుంటాయి. ఒకే గ్రామంలో కొంతమంది ఒకరిపట్ల మరొకరు ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు కలిగివుంటారు. అదే సమయంలో ఇంకొంతమంది గ్రామస్తులు ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, అసూయ, ఆగ్రహావేశాలతో రగిలిపోతుంటారు. కానీ అవసరాన్నిబట్టి ఆపద వచ్చినప్పుడు ఆ గ్రామస్తులంతా మళ్లీ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతని చాటుకుంటారు. అంటే గ్రామాలన్నీ ఒక రకంగా రంగస్థలం వంటివే అనే ఉద్దేశంతోనే తాను ఆ టైటిల్‌ని ఎంచుకున్నాను" అని ప్రకటించాడు సుకుమార్. అదండీ 'రంగస్థలం 1985' టైటిల్ వెనుకున్న కథాకమామిషు.



Latest News