తాజా వార్తలు

కోహ్లి ఫుల్ హ్యాపీ..!

జ్వరం కారణంగా శ్రీలంకతో జరిగిన గాలె టెస్టుకి దూరమైన రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫిటెనెస్ సాధించాడు. తాజాగా అతను కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఎంజాయ్ చేస్తూ ఫొటోలకి పోజులిచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం చేతి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్‌, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటలనకి దూరమయ్యాడు.

శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికై.. వార్మప్ మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన రాహుల్.. తీరా తొలి టెస్టుకి జ్వరంతో దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్‌కి తుది జట్టులో కోహ్లి చోటిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులకు ఔటై నిరాశపరిచిన అభినవ్.. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో సత్తా చాటాడు. దీంతో గురువారం నుంచి ఆరంభంకానున్న రెండో టెస్టులో మళ్లీ ఛాన్సిస్తారా..? లేదా కేఎల్ రాహుల్‌ని బరిలోకి దించుతారో చూడాలి. కెప్టెన్ కోహ్లి ఎప్పటి నుంచో కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచుతూ వరుస అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో కొలంబో టెస్టులో అభినవ్ ముకుంద్ బెంచ్‌కే పరిమితమవుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.Latest News