తాజా వార్తలు

భారీ స్కోరు దిశగా భారత్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్ దూసుకెళ్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (190: 168 బంతుల్లో 31x4)‌తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (123 నాటౌట్: 219 బంతుల్లో 10x4) శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 80 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 361 పరుగులతో కొనసాగుతోంది.

టీ విరామ సమయానికి కొద్ది నిమిషాల ముందే.. శిఖర్ ధావన్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (3) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన అజింక్య రహానె (24 నాటౌట్)‌‌తో కలిసి పుజారా భారత్ ఇన్నింగ్స్‌ని నడిపిస్తున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం నాలుగో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఈ రోజు ఆటలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండటంతో.. భారత్ 400 స్కోరు చేరుకునే అవకాశం ఉంది.



Latest News