తాజా వార్తలు

డ్రగ్స్ కేసు దర్యాప్తుపై ఘాటుగా స్పందించిన కొరటాల!

గత రెండు, మూడు వారాలుగా టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ రాకెట్ కేసు విచారణపై సినీ ప్రముఖులు ఎవరికి వారు తమకి తోచిన విధంగా స్పందిస్తున్నారు. కేవలం టాలీవుడ్‌ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దర్యాప్తు చేయిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై సైతం సినీ ప్రముఖులు తమ వాయిస్ వినిపించారు. అయితే, తాజాగా ఈ వివాదంపై స్పందించిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ మాత్రం తనదైన స్టైల్లోనే ప్రభుత్వానికి సవాల్ విసిరే స్టైల్లో ఓ ట్వీట్ చేశారు.

'ప్రభుత్వాలు అవినీతిని అంతం చేయడానికి కూడా ఇటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్(సిట్స్) ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది' అని సూచించిన కొరటాల.. 'తన దృష్టిలో డ్రగ్స్ కన్నా కూడా అవినీతిని అంతం చేస్తే సమాజానికి మరింత మేలు జరుగుతుంది' అని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ భూతం కన్నా అవినీతి చాలా డేంజర్ అని పేర్కొన్న కొరటాల... 'ప్రభుత్వాలు తల్చుకుంటే, అవినీతిని అరికట్టేందుకు కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయగలవు' అని తన ట్వీట్‌లో స్పష్టంచేశారు. Latest News