తాజా వార్తలు

ఢిల్లీలో ఘోర ప్రమాదం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మయూర్ విహార్‌కు సమీపంలోని జాతీయ రహదారి 24పై రెండు వాహనాలు ఢీకొన్నాయి. అతివేగంతో రావడంతో ఓ కారు బోల్తా కొట్టింది. టిప్పర్ పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Latest News