తాజా వార్తలు

వెంకీ కొత్త సినిమా

ఈ ఏడాది మార్చి నెలాఖరులో రిలీజైన గురు సినిమాతో తన ఖాతాలో ఓ హిట్ సినిమాను వేసుకున్న విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఏ ఇతర చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే, తాజాగా నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా హౌజ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు.. వెంకీ తర్వాతి ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించారు.

 

వెంకీ తర్వాతి సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిశ్రమకి పరిచయం కానున్నాడని చెప్పిన సురేష్ బాబు.. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది అని అన్నారు. అంతేకాకుండా వెంకీ కొత్త సినిమాలో రాజమౌళి ఈగ సినిమా మాదిరిగా ఓ జంతువుకి కీలక పాత్ర వుండనుందని స్పష్టంచేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ సహాయంతో తెరకెక్కించనున్న ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోందని సురేష్ బాబు తెలిపారు. సురేష్ బాబు చెప్పిన వివరాలని ప్రకారం, వెంకీ తర్వాతి ప్రాజెక్ట్ భారీ థ్రిల్లర్ సినిమా కానుందని అర్థమవుతోంది.Latest News