తాజా వార్తలు

టీమిండియా ఆధిక్యం 498

గాలె: శ‌్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా విజ‌యం ఇక లాంచ‌న‌మే. తొలి ఇన్నింగ్స్‌లో లంక‌ను 291 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన విరాట్ సేన‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ దీటుగా ఆడుతున్న‌ది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్ల‌కు 189 ర‌న్స్ చేసింది. ప్ర‌స్తుతం ఓవ‌రాల్‌గా 498 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా. మ‌రో రెండు రోజుల ఆట మిగిలి ఉండ‌టంతో.. విరాట్ సేన విజ‌యం ఖాయంగానే క‌నిపిస్తున్న‌ది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ అభిన‌వ్ ముకుంద్ (83), కెప్టెన్ విరాట్ కోహ్లి (75 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ధావ‌న్ (14), పుజారా (15) విఫ‌ల‌మైనా.. ఈ ఇద్ద‌రూ మూడో వికెట్‌కు 133 ప‌రుగులు జోడించారు.అంత‌కుముందు మాథ్యూస్ (83), పెరీరా (92) పోరాడ‌టంతో శ్రీలంక 291 ప‌రుగులైనా చేయ‌గ‌లిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 309 ప‌రుగుల భారీ ఆధిక్యం టీమిండియాకు ద‌క్కినా.. శ్రీలంక‌ను ఫాలోఆన్ ఆడించ‌లేదు. జ‌డేజా 3, ష‌మి 2, ఉమేష్‌, అశ్విన్‌, పాండ్యా త‌లా ఒక వికెట్ తీసుకున్నారు. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డిన గుణ‌ర‌త్నె టెస్ట్ మొత్తానికీ దూర‌మ‌వ‌డంతో.. లంక ప‌ది మందితోనే ఆడుతున్న‌ది.Latest News