తాజా వార్తలు

2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్

టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా సమానమైన డిమాండ్ వున్న హీరోయిన్ నయనతార. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఎవరికైనా సూట్ అయ్యే హీరోయిన్ కావడంతో నయనతారకి హిట్స్‌తో ఫట్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్ కొనసాగుతోంది. సాధారణంగా సినిమాలకి రూ. 4 కోట్ల పారితోషికం తీసుకునే ఈ హీరోయిన్ తాజాగా ఓ టీవీ యాడ్ చేయడానికి ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేయడం ప్రస్తుతం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అమ్మడికి వున్న డిమాండ్ అటువంటిది కావడంతో ఆ వాణిజ్య సంస్థ కూడా ఆమె అడిగినంత ఇచ్చిందని కోలీవుడ్ టాక్.

అయితే, ఇంతా చేసి ఆ టీవీ యాడ్ షూట్ చేయడానికి ఆమెకి పట్టిన సమయం ఎంతో కాదు.. జస్ట్ రెండంటే రెండే రోజుల్లో యాడ్ షూటింగ్ ముగించిందట. కేవలం రెండు రోజుల షూటింగ్‌కి డేట్స్ ఇచ్చిన నయనతార ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేయడం చూసి కోలీవుడ్ అవాక్కవుతోంది. ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి ఇంకా వెల్లడి కాలేదు.Latest News