తాజా వార్తలు

షూటింగ్ నుంచే డైరెక్ట్ గా సిట్ ఆఫీసుకి చార్మి

గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న సెలబ్రిటీలను విచారిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 10 గంటలకే చార్మి పలువురు బౌనర్స్, తన లాయర్ తో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకుంది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ ప్రాంగణం చార్మి రాకతో హడావిడిగా మారింది. అయితే చార్మిని తప్ప మరెవరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. 

సిట్ కార్యాలయంలో చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సీఐలు విజలక్మీ, శ్రీలత, రేణుక విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే వారు చార్మిని ప్రశ్నిస్తున్నారు. కెల్విన్ మొబైల్ లో ఆమె పేరు చార్మి దాదా పేరుతో ఉండడం, ఇద్దరి మధ్య వాట్సాప్ లో వెయ్యికి పైగా కన్వర్జేషన్ , జ్యోతి లక్ష్మీ ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీలు దిగడం వంటి అంశాలపై సిట్ మహిళా అధికారుల బృందం చార్మిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. 

అయితే చార్మి ఈ రోజు ఉదయం కొండాపూర్ లో పైసా వసూల్ షూటింగ్ లో పాల్గొని అక్కడి నుండి డైరెక్ట్ గా సిట్ ఆఫీసుకి హాజరైనట్టు తెలుస్తుంది. ఆసుపత్రిలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలలో చార్మి పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు చార్మి పైసా వసూల్ చిత్రానికి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూస్తుంది.



Latest News