తాజా వార్తలు

ప్రపంచకప్‌లు గెలిచా.. కానీ ఆకలి..?

ఆటగాడిగా భారత్ కోసం ప్రపంచకప్‌లు గెలిచాను.. కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిళ్లను చేజిక్కించుకున్నాను. కెరీర్‌లో ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాను. కానీ.. ప్రస్తుతం ప్రజల మనసులు గెలుచుకునేందుకు.. వారి ఆకలి బాధలు తీర్చేందుకు నడుం బిగించాను. ఆకలితో బాధపడేవారి కోసం గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కిచెన్‌ని ప్రారంభించానని’ భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు.

ఢిల్లీలోని పటేల్ నగర్‌లో మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌతమ్ గంభీర్ స్వయంగా కొంతమందికి భోజనం అందించాడు. ‘ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు’ అని దేవుడ్ని ప్రార్థిస్తూ తాను ఈ కార్యక్రమాన్ని ఆరంభించినట్లు వెల్లడించాడు. ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ఈ అన్నదానం కొనసాగుతుందని ఆయన వివరించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుక్మా ప్రాంతంలో నక్సల్స్ దాడితో ప్రాణాలు కోల్పోయిన 25 మంది సీఆర్ఫీఎప్ జవాన్ల పిల్లలకి చదువు చెప్పించే బాధ్యతను గౌతమ్ గంభీర్ తీసుకున్న విషయం తెలిసిందే.



Latest News