తాజా వార్తలు

మతం మార్చుకున్న కమల్‌హాసన్ కూతురు!

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో తన నటనతో ఆకట్టుకున్న విలక్షణ నటుడు కమల్‌హాసన్. ఈ జాతీయ నటుడు రెండో కుమార్తె అక్షర హాసన్‌ మతం మార్చుకున్నారట.సహాయ దర్శకురాలిగా, నటిగా గుర్తింపు పొందిన ఆమె ముంబయిలో ప్రయాణించేటప్పుడు లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించేది. అజిత్‌, కాజల్‌, అక్షరా హాసన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం వివేకం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్షరహాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకుంది.

తన సినీ కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. నటిగా వెండితెరకు పరిచయైనప్పుడు నా తల్లిదండ్రుల వివరాలు ఎవరికీ తెలియదని, ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అక్షర తెలిపింది. నేనెవరో తెలిస్తే సహాయ దర్శకురాలిగా అనుభవాలను కోల్పోయేదాన్నినని పేర్కొంది. తెర వెనుక సాంకేతికంగా ఏం జరుగుతోందో తెలుసుకున్నా. దీని వల్ల కెమెరా ముందు ఇప్పుడు ఎలా ఉండాలో బాగా తెలుసని అన్నారు. నేను చేసిన తొలి ఉద్యోగం క్లాపర్‌ గర్ల్‌... సీన్‌ 1, టేక్‌ 1 బై 1 అని చెప్పేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.Latest News