తాజా వార్తలు

సెగ అప్పుడే మొదలైపోయింది.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్ సెగ అప్పుడే మొదలైపోయింది. నవంబరు 23 నుంచి జరగనున్న ఐదు టెస్టుల ఈ సిరీస్‌‌‌ని రెండు జట్లు ఆధిపత్యపోరుగా భావిస్తుంటాయి. టోర్నీ కంటే ముందే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లకి ఆసీస్ బౌలర్ల‌‌తో కష్టాలు తప్పవని ఆ జట్టు బౌలర్ మిచెల్ స్టార్క్ తాజాగా హెచ్చరికలు జారీ చేశాడు. గత ఏడాది కాలంగా పాదం గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్క్ ఇటీవల ఫిటెనెస్ పరీక్ష ఎదుర్కొని.. యాషెస్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు. 2013-2014 యాషెస్ సిరీస్‌‌లో 37 వికెట్లతో సత్తాచాటిన తన సోదరుడు మిచెల్ జాన్సన్‌ ఈ సారి జట్టులో లేకపోయినా.. ఇప్పుడున్న బౌలర్లతోనే ఇంగ్లాండ్‌ని కట్టడి చేస్తామని స్టార్క్ ధీమా వ్యక్తం చేశాడు.

‘ఆస్ట్రేలియా జట్టులో ప్రస్తుతం బలమైన పేస్ బౌలింగ్ విభాగం ఉంది. పాట్ కమిన్స్ వేగవంతమైన బౌన్సర్లు విసరగలడు.. హేజిల్‌వుడ్ లయ తప్పకుండా బంతులు సంధిస్తాడు. ఇంకా కౌల్టర్ నైల్, పాటిన్స్‌సన్, నేను ఇలా ఐదుగురు బౌలర్లు ఉన్నాం. మేమంతా కలిసి మిచెల్ జాన్సన్‌ని గుర్తుకు తెచ్చేలా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లకి ముచ్చెమటలు పట్టిస్తాం’ అని మిచె‌ల్ స్టార్క్ ధీమా వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం జరిగిన యాషెస్ సిరీస్‌లో మిచెల్ జాన్సన్ ఐదు టెస్టుల్లో కలిపి 37 వికెట్లు పడగొట్టడంతో.. ఆస్ట్రేలియా 5-0తో సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేసేసింది. దీంతో ప్రస్తుతం ప్రతీకారంతో ఉన్న ఇంగ్లాండ్‌కి గతవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్.. మద్యం తాగి ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో తాత్కాలికంగా సస్పెన్షన్‌కి గురయ్యాడు.Latest News