తాజా వార్తలు

11.44 లక్షల పాన్ కార్డులు రద్దు..

దేశంలో మొత్తం 11.44 లక్షల పర్మనెంట్ అకౌంట్ నంబర్ల(పాన్స్)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఒకే వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉన్నా, లేదా తప్పుడు ధ్రువపత్రాలతో పాన్ కార్డు తీసుకున్నా వాటిని రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. మీ 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను పాన్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదాయ పన్ను శాఖ కొన్ని పాన్ కార్డులను రద్దు చేయడంతో చాలా మంది ఆందోళనకు గురువుతున్నారు.Latest News