తాజా వార్తలు

సిట్ కీలక సమాచారం రాబట్టిందా

సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో 8వ రోజు విచారణలో భాగంగా నేడు సిట్ అధికారులు సినీ నటి ముమైత్ ఖాన్‌ని ప్రశ్నించారు. కాసేపటిక్రితమే ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు ఆరున్నర గంటలపాటు కొనసాగిన ఈ విచారణలో సిట్ అధికారులు ఆమె నుంచి తమకి కావాల్సిన కీలక సమాచారాన్ని రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. సినీ నటి చార్మీ తరహాలోనే ముమైత్ ఖాన్‌ని కూడా మహిళా పోలీసు అధికారులే ప్రశ్నించినట్టు సమాచారం.

షెడ్యూల్ ప్రకారం ఈనెల 21వ తేదీనే ముమైత్ ఖాన్ సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సి వున్నప్పటికీ ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంటున్న కారణంగా ఆమెకి పోలీసులు జారీ చేసిన నోటీసులు తగిన సమయంలో అందలేదు. వాట్సాప్ ద్వారా సైతం పోలీసులు ముమైత్‌కి సమాచారం చేరవేసే ప్రయత్నం చేశారు కానీ అది కూడా ఆలస్యమవడం, ఆమె బిగ్ బాస్ షో నుంచి బయటికి రావడానికి షో నిర్వాహకుల నుంచి పలు షరతులు అడ్డుగా నిలవడంతో సిట్ అధికారులు ఆమెని ఇవాళ ప్రశ్నించారు. ఈ విచారణకు హాజరయ్యేందుకుగాను ముమైత్ బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి అనుమతి తీసుకుని ప్రత్యేకంగా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ఆమె ముంబై వెళ్లిపోనున్నారు.Latest News