తాజా వార్తలు

భారత్‌కు గుడ్ న్యూస్!

సింధు న‌దీ జ‌లాల ఒప్పందం విష‌యంలో ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌కు చెంపపెట్టు లాంటి నిర్ణయం వెలువడింది. ఈ అంశంపై కీలక పాత్ర పోషిస్తున్న వ‌ర‌ల్డ్‌బ్యాంక్.. భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. జీలం, చీనాబ్ న‌దుల‌పై హైడ్రోఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్స్ నిర్మించుకునే హ‌క్కు ఇండియాకు ఉంద‌ని తేల్చి చెప్పింది. ఈ విష‌యంలో పాకిస్థాన్ వాద‌న‌ను ప్రపంచ బ్యాంక్ తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఇండియా, పాకిస్థాన్ కార్య‌ద‌ర్శి స్థాయి చర్చ‌ల త‌ర్వాత వ‌ర‌ల్డ్ బ్యాంక్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ప్రపంచ బ్యాంక్ తాజా తీర్పుతో.. సింధు నది జలాల వినియోగం విషయంలో పాకిస్థాన్ ఆరోపణల్లో ఏమాత్రం పసలేదని తేలిపోయింది. దీంతో జీలం, చీనాబ్ న‌దుల‌పై కిష‌న్‌గంగా (330 మెగావాట్లు), రాట్లె (850 మెగావాట్లు) హైడ్రోఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్స్‌ను నిర్మించడానికి భారత్‌కు మార్గం సుగమమైంది. వ‌ర‌ల్డ్ బ్యాంక్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతోనే 1960లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య సింధు జ‌లాల ఒప్పందం కుదిరింది.Latest News