తాజా వార్తలు

శ్రీలంక 50/2

కొలంబో: రెండ‌వ టెస్ట్‌లో శ్రీలంక రెండ‌వ‌ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 50 ర‌న్స్ చేసింది. ఇంకా శ్రీలంక‌ 572 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ భారీ స్కోరు సాధించింది. తొమ్మిది వికెట్ల‌కు 622 ప‌రుగుల ద‌గ్గ‌ర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చెతేశ్వ‌ర్ పుజారా (133), ర‌హానే (132) సెంచ‌రీల‌కు తోడు.. జ‌డేజా (70 నాటౌట్‌), సాహా (67), కేఎల్ రాహుల్ (57), అశ్విన్ (54)లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 600 చేసిన భార‌త్.. ఇప్పుడు ఆ స్కోరును మించి సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌పైనా కోహ్లి సేన ప‌ట్టు బిగించిన‌ట్లే. లంక బౌల‌ర్ల‌లో హెరాత్ 4, పుష్ప‌కుమార 2 వికెట్లు తీసుకున్నారు. ఆ త‌ర్వాత తొలి ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన శ్రీలంక‌.. ప‌రుగుల ఖాతా తెర‌వ‌క‌ముందే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ త‌రంగ డ‌కౌట‌య్యాడు. రికార్డుతో ఊపు మీదున్న అశ్వినే ఈ వికెట్ తీసుకున్నాడు. చండీమాల్ 8, మెండీస్ 16 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.Latest News