తాజా వార్తలు

'యుద్ధం శరణం' టీజర్ వచ్చేస్తోంది

సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్‌లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం మూవీ హిట్ అవడంతో అదే జోష్‌లో నాగచైతన్య నటిస్తున్న మరో కొత్త సినిమా 'యుద్ధం శరణం' ప్రస్తుతం సెట్స్‌పై వుంది. చైతూ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సినిమాతో కృష్ణ మరిముత్తు అనే ఓ కొత్త డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వారాహీ చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న యుద్ధం శరణం సినిమా తెరకెక్కుతున్న తీరుపై చైతూ ఫుల్ హ్యాపీగా వున్నాడు. ఈ నెల 31వ తేదీన యుద్ధం శరణం టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తాజాగా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. Latest News