తాజా వార్తలు

మట్టితో స్నానం చేస్తే రోగాలన్నీ మటాష్!

చాలా మంది మట్టి, బురదను చూస్తే అసహ్యించుకుంటారు. కాళ్లకు కొంచెం మట్టి అంటుకోగానే నీళ్లతో శుభ్రంగా కడిగేసుకుంటారు. కానీ మట్టి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే మీరే అవాక్కవుతారు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చాలావి మట్టిలోనుంచి వచ్చినవే. మనిషిని మట్టిని వేరుచేయలేం. మన ఆరోగ్య విషయంలోనూ మట్టి పాత్ర చాలా కీలకం. మలినాల వల్ల సమస్త చర్మరోగాలకూ శరీరం నిలయమవుతుంది. వీటి నివారణ కోసం వచ్చినవే ప్రకృతి సిద్ధమైన మట్టి చికిత్సలు. ప్రకృతి వైద్య విధానంలో మట్టితో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శరీరమంతా బురద పూసే ఈ వైద్యాన్ని ‘మడ్ బాత్’ అని పిలుస్తారు.

కొంత మందిలో పొత్తికడుపు చాలా వేడిగా ఉంటుంది. అలాంటి వారికి మల, మూత్ర విషర్జన కష్టంగా అనిపిస్తుంది. ఇలా జరగడం మంచిది కాదు. దీని వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. ఈ పరిస్థితులను నివారించడంలో మడ్‌ ప్యాక్‌ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. అంటే పొత్తికడుపు ప్రాంతంలో నానబెట్టిన బంకమట్టి ముద్దను ఒక పలుచని, తడిగా ఉండే నూలు గుడ్డపై పెట్టి అద్దాలి. ఈ ప్రక్రియను 20 నుంచి 30 నిమిషాల పాటు చేయాలి. మట్టి ఆరిపోగానే తిరిగి రాస్తూ ఉండాలి.



Latest News