తాజా వార్తలు

ధావ‌న్ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

గాలె: టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌.. టెస్టుల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో 190 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు ధావ‌న్. అయితే టెస్టుల్లో అత‌నికిదే అత్య‌ధిక స్కోరు. గ‌తంలో ఆస్ట్రేలియాపై చేసిన 187 స్కోరును అత‌ను అధిగ‌మించాడు. అప్ప‌ట్లో ఆ స్కోరును కూడా అత‌ను తొలి రోజే సాధించ‌డం విశేషం. ఇప్పుడు కేవ‌లం 168 బాల్స్‌లోనే 190 ర‌న్స్ చేశాడు ధావ‌న్‌. అందులో 31 ఫోర్లు ఉన్నాయి. మొద‌టి నుంచీ లంక్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన ధావ‌న్‌.. సునాయాసంగా ప‌రుగులు సాధించాడు. బౌండ‌రీల వ‌ర్షం కురిపిస్తూ టీ20ని త‌ల‌పించాడు. పుజారాతో క‌లిసి రెండో వికెట్‌కు 153 ప‌రుగులు జోడించాడు.Latest News