తాజా వార్తలు

స్పిన్నర్ అశ్విన్ ఇక రిలాక్స్ అవుతాడట..!

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో అరుదైన ఘనతకి చేరువయ్యాడు. శ్రీలంకతో బుధవారం నుంచి ఆరంభంకానున్న మ్యాచ్‌తో ఈ స్పిన్నర్ 50 టెస్టుల రికార్డుని చేరుకోనున్నాడు. గత రెండేళ్లుగా ఒంటిచేత్తో భారత్‌కి విజయాలు అందిస్తూ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 49 టెస్టులాడి 275 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 25 సార్లు ఐదు వికెట్ల ఫీట్.. 7 సార్లు 10 వికెట్ల రికార్డు ఉండటం అతని జోరుకి నిదర్శనం.

‘రెండేళ్ల క్రితం టెస్టు జట్టులో పునరాగమనం‌తో ప్రతి టెస్టులో కనీసం ఆరు వికెట్లు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. లయ అందుకున్న తర్వాత.. కొన్ని టెస్టుల్లో ఏకంగా 10 వికెట్లు కూడా పడగొట్టగలిగాను. నా కెరీర్‌లో బెస్ట్ అంటే.. 2015లోనే. ఆ ఏడాది ప్రదర్శనతోనే టెస్టు జట్టులో సుస్థిర స్థానం సంపాదించగలిగాను. కెరీర్‌లో 50వ టెస్టు అంటే ప్రత్యేకమే. ఇక్కడ నుంచి ప్రత్యేక లక్ష్యాలను ఏర్పరచుకోకుండా.. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తూ క్రికెట్‌ని ఆస్వాదిస్తాను’ అని అశ్విన్ వివరించాడు.Latest News