తాజా వార్తలు

చార్మి‌కి అకున్ సబర్వాల్ క్లారిటీ!

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేసు దర్యాప్తు చట్టబద్దంగా సాగుంతుందని కొంతమందికి అవగాహన లేక కోర్టును ఆశ్రయిస్తున్నారంటూ చార్మీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అకున్ సబర్వాల్. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి చార్మి ఈరోజు హైకోర్టును ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేసింది. ఇందులో సిట్ అధికారుల విచారణ చట్టబద్ధంగా జరగటంలేదని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఈనెల 26న సిట్ విచారణకు హాజరౌతున్న తనను విచారణ చేస్తున్న సమయంలో న్యాయవాదిని కూడా అనుమతించాలని చార్మి హైకోర్ట్ పిటిషన్‌లో కోరారు.

తనుకు ఇంకా పెళ్లి కాలేనందున రక్త నమూనాలను సేకరించడం చట్ట విరుద్ధం అంటూ .. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్‌ను సిట్ అధికారులు పాటించడం లేదని.. విచారణ సందర్భంగా బలవంతంగా రక్త నమునాలు సేకరించడం చట్టవిరుద్ధమంటూ ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా శాంపిల్స్ సేకరించారదని, తనను విచారించడానికి మహిళా అధికారిని నియమించాలంటూ చార్మి తరుపు లాయర్ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు.



Latest News